APNRTS కెనడా & సింగపూర్ టీమ్స్, Health Sciences North Hospital – కెనడా మరియు Mask On సంస్థ – యుఎస్ఎ వారు APNRT Trust కు పంపిన వైద్య సామాగ్రి నుండి రూ. 3,83,050 విలువ గల వైద్య సామాగ్రిని జూలై 5వ తేదీన APNRTS సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ చిత్తూరు జిల్లా డీఎంహెచ్ఓ డా. శ్రీహరి, డిసిహెచ్ డా. సరళమ్మ, అదనపు డీఎంహెచ్ఓ డా. అరుణ సులోచనాదేవి గార్లకు అందజేశారు. ఇందులో 10వేల సర్జికల్ మాస్కులు, 75 లీటర్ల శానిటైజర్, 200 N95 మాస్కులు, 100 K95 మాస్కులు, 100 N99 మాస్కులు, 125 ఫేస్ షీల్డ్స్, 200 PPE కిట్స్, 25 ఓరో నాజల్ ఐసియు మాస్కులు మరియు 25 ఐసియు మాస్కులకు ఫిల్టర్స్, 900 సర్జికల్ క్యాప్స్ ఉన్నాయి.