Embassy
Facebook
Twitter
Instagram
Youtube
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రులకు పంపిణీ చేయమని Mask On సంస్థ – యుఎస్ఎ, Health Sciences North Hospital –Canada, మరియు APNRTS సింగపూర్ & కెనడా టీమ్స్ పంపిన వైద్య సామాగ్రిలో స్విమ్స్ ఆసుపత్రికి అవసరమైన రూ. 2,01,525 విలువ గల ఎన్-95 మాస్కులు, ఫేస్ షీల్డ్స్ , సర్జికల్ క్యాప్స్, ఓరో నాజల్ ఐసియు మాస్కులు, ఐసియు మాస్కులకు ఫిల్టర్స్, సర్జికల్ మాస్కులు మరియు శానిటైజర్లను తిరుపతి ఎంపి శ్రీ. గురుమూర్తి గారి ద్వారా APNRTS సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ స్విమ్స్ సంచాలకులు డా. భూమ వెంగమ్మకు జూలై ౩వ తేదీన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డా. కోటి రెడ్డి, డా. యర్రమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.