Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS సింగపూర్ & కెనడా టీమ్స్ మరియు Health Sciences North Hospital –Canada వారు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయమని కోవిడ్ సంబంధిత వైద్యసామాగ్రిని APNRT Trust కు విరాళంగా పంపారు. ఇందులోనుంచి రూ. 3,04,625 విలువగల 5వేల సర్జికల్ మాస్కులు, 35 లీటర్ల శానిటైజర్, 100 N95 మాస్కులు, K95 మాస్కులు 100, N99 మాస్కులు 100, 50 పల్స్ ఆక్సిమీటర్లు, 125 ఫేస్ షీల్డ్స్, 150 PPE కిట్స్, 500 సర్జికల్ క్యాప్స్ మరియు 2200 సర్జికల్ గ్లౌజులను తిరుపతి ఎమ్మెల్యే శ్రీ. భూమన కరుణాకర రెడ్డి గారి ఆధ్వర్యంలో APNRTS సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. భారతి గారికి జూలై ౩వ తేదీన అందించారు. పేదలకు సేవ చేస్తున్న రుయా ఆసుపత్రికి ప్రవాసాంధ్రులు వైద్య సామాగ్రి అందించడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే శ్రీ. భూమన కరుణాకర రెడ్డి గారు అన్నారు. ఈ మొత్తం విరాళాల ప్రక్రియ చేపట్టిన APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో నగర మేయర్ డా. శిరీష, డిప్యూటి మేయర్ శ్రీ. ముద్ర నారాయణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.