Embassy
Facebook
Twitter
Instagram
Youtube
వివిధ దేశాల్లోని ప్రవాసాంధ్రులు, స్వచ్చంద సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా తమవంతు సాయం చేయడానికి ముందుకువస్తున్నారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో పంపిణీ చేయమని వైద్య సామాగ్రిని APNRT Trust కు పంపిస్తున్నారు. ఇవాళ APNRTS కార్యాలయంలో ఈ సామాగ్రి పంపిణీని మాజీ లోక్ సభ ఎంపి మరియు తితిదే అధ్యక్షులు శ్రీ. వై.వి. సుబ్బారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సుబ్బా రెడ్డి గారు మాట్లాడుతూ... Swasth Foundation & ACT స్వచ్చంద సంస్థలు, Health Science North Hospital – కెనడా మరియు యుఎస్ఎ, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కువైట్ ఇలా వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు రూ. 4,28,08,885 విలువగల వైద్య సామాగ్రిని ఇవ్వడం గొప్ప విషయమన్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ సామాగ్రిని వివిధ దేశాల నుండి ఒకచోటికి చేర్చి, రాష్ట్ర ముఖ్యమంత్రికి తోడ్పాటుగా నిలిచిన APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటిని అభినందించారు. శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో APNRTS పనిచేస్తుందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 70 ఏరియా మరియు పెద్దాసుపత్రులకు వైద్య సామాగ్రి పంపిణీ జరిగిందని తెలిపారు.