Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలలో ఆంధ్రప్రదేశ్ లో గల ప్రముఖ దేవాలయాల దర్శనం ఒకటి. వివిధ దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు తమ పనుల నిమిత్తం వారి స్వస్థలాలకు వస్తుంటారు. ఎక్కువ సెలవులు లేకపోవడం, ఇతరత్రా కారణాల వలన వారు పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్ళలేకపోతుంటారు. కనుక వారికి త్వరగా దర్శనాలు కల్పించడం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ దేవాలయాల దర్శనం సేవ అందిస్తోంది. దేవాలయాల దర్శనాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలు పునరుద్ధరించబడ్డాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ప్రవాసాంధ్రులు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్ సైట్ టెంపుల్ ట్రావెల్ లో మీ వివరాలు నమోదు చేసుకోగలరు లేదా ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ కి కాల్ చేయగలరు. సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే దర్శనాలు కల్పించబడుతాయి. ఒక రిక్వెస్ట్ మీద ఆరు మందికి (1+5) దర్శనం అనుమతి ఉంటుంది. రిక్వెస్ట్ కనీసం 72 గంటల ముందు నమోదు చేసుకోవాలి. గమనిక: టిటిడి నిర్వహించే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల సమయంలో దర్శనాలకు అనుమతి ఉండదు. అప్పటికప్పుడు దర్శనాలు రద్దు చేసే హక్కు టిటిడికి కలదు