ఒమాన్ ఆమ్నెస్టీ లో భాగంగా రెండవ విడతలో ఫిబ్రవరి 25 వ తేదీన ముగ్గురు మహిళలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున APNRTS రాష్ట్రానికి తీసుకొచ్చింది

ఒమాన్ ఆమ్నెస్టీ లో భాగంగా రెండవ విడతలో ఫిబ్రవరి 25 వ తేదీన ముగ్గురు మహిళలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున APNRTS రాష్ట్రానికి తీసుకొచ్చింది. వీరిని విమానాశ్రయంలో APNRTS సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు. వీరికి విమాన టికెట్లతో పాటు, విజయవాడ విమానాశ్రయం నుండి వారిని వారి స్వస్థలాలకు చేర్చే వరకు భోజన ఖర్చులు మరియు ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చింది. బాధితులు కడప, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవారు. స్వదేశానికి చేరుకున్న బాధితులు మాట్లాడుతూ... తమను రాష్ట్రానికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి శ్రీ. జగన్మోహన్ రెడ్డి గారికి, APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.