Embassy
Facebook
Twitter
Instagram
Youtube
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం APNRTS ఒమాన్ ఆమ్నెస్టీ లో భాగంగా మొదటి విడతలో కొంతమంది బాధితులకు విమాన టికెట్లు ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకొచ్చింది. బాధితులు 14వ తేది సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు మస్కట్ నుండి విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి APNRTS సిబ్బంది స్వాగతం పలికారు. బాధితులంతా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందివారు. వీరిని విమానాశ్రయం నుండి వారి స్వస్థలాలకు చేర్చే వరకు భోజన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు అన్నీ APNRTS యే సమకూర్చింది. తమ పిల్లలను మళ్ళీ చూసుకోబోతున్నామంటే దానికి కారణం జగనన్న, వెంకట్ సర్ లేనని బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.