Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS ద్వారా గుంటూరు అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కేంద్రం నందు “ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్” 3వ బ్యాచ్ మార్చి 2020 లో ప్రాంభించారు. కోవిడ్ -19 లాక్ డౌన్ వలన నమోదు చేసుకున్న 35 మంది అభ్యర్ధులకు ఆన్ లైన్ విధానం లో 70 రోజులు శిక్షణ కల్పించటం జరిగింది. అన్ లాక్ తర్వాత కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, అభ్యర్థులకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజనము మరియు అన్ని సదుపాయాలతో ఉచిత శిక్షణ కల్పించటం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. వీరిలో 20 మంది దుబాయ్ లోని “Protacabin Manufacturing LLC” కంపెనీ నందు ఉద్యోగ అవకాశాలు పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఫిబ్రవరి 1వ తేదీన APNRTS ప్రధాన కార్యాలయంలో APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి చేతుల మీదుగా అంతర్జాతీయ నైపుణ్య ధ్రువ పత్రము మరియు కంపెనీ ఆఫర్ లెటర్, వీసాలు అందజేయటం జరిగింది. ఉద్యోగము పొందిన అభ్యర్థులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి గారికి ధన్యవాదాలు తెలియచేశారు.