Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ప్రవాసీ భారతీయ దివస్ 2021 ని పురస్కరించుకొని యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లోని కో ఆర్డినేటర్ల మరియు ప్రవాసాంధ్రులతో జనవరి 7 వ తేదీ రాత్రి 8 గంటలకు ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ. వెంకట్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలను వివరించారు. ఏపీ లో పెట్టుబడులకు గల అవకాశాలను మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ను వివరించారు. ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ – కనెక్ట్ టు ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రవాసాంధ్రులు తమ గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే, ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తున్న మరిన్ని సేవల గురించి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నారని తెలిపారు. ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ కోవిడ్ సమయం లో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అందించిన సేవలను కొనియాడారు.