Embassy
Facebook
Twitter
Instagram
Youtube
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా వివిధ దేశాలలోని వలసదారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్లుతో ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు వర్చువల్ సమావేశం నిర్వహించారు. కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమాన్, మలేషియా మొదలగు దేశాల నుండి వలసదారుల క్షేమం మరియు భద్రత కోసం పలు సలహాలను, సూచనలను తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలైన ...ప్రవాసాంధ్ర భరోసా బీమా, , విదేశాల్లో చిక్కుపోయిన వారిని స్వదేశానికి రప్పించడం, భౌతికాయాలను స్వస్థలాలకు చేర్చుట, ఎక్స్ గ్రేషియా, ఉచిత అంబులెన్సు సేవ తదితర సేవలను శ్రీ వెంకట్ గారు సమావేశంలో పాల్గొన్న సభ్యులకు వివరించారు. కోవిడ్ 19 సమయం లో ఏపీఎన్ఆర్టీఎస్ నిరంతరాయంగా అందించిన సేవలను వలసదారులు మరియు వలసదారులు కొనియాడారు. ఈ సమావేశం లో ఏపీఎన్ఆర్టీ సొసైటీ సీఈఓ (ఇంఛార్జ్) శ్రీ. మల్లేశ్వర రావు గారు, సిబ్బంది పాల్గొన్నారు.