ఇతర దేశాలకు పనుల నిమిత్తం వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి, తాము విజిట్ వీసా మీద ఆయా దేశాలకు వచ్చామని తెలియక ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్న వారి పై ఆయా దేశాల ప్రభుత్వాల వారు అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్నారంటూ తమ దేశాన్ని విడిచి వెళ్ళమని ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రకటిస్తాయి. ఆమ్నెస్టీ ప్రకటించి జరిమానాలు చెల్లించి వెళ్ళమని ఆదేశాలు జారీ చేస్తారు. వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS జరిమానాలు చెల్లించి, టికెట్స్ ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చింది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కువైట్ ప్రభుత్వం ఆమ్నెస్టీ ని ప్రకటించి, జరిమానాలు రద్దు చేసి, ఆ ప్రభుత్వం వారే విమానాలు ఏర్పాటు చేసి 2538 మందిని ఆంధ్రప్రదేశ్ కు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి అన్ని సదుపాయాలతో ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేయగా, కువైట్ నుండి విమానాలు నేరుగా రాష్ట్రానికి తీసుకు రావడం లో APNRTS కృషి ఎనలేనిది.