ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభా నాయుడు గారి మృతి

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభా నాయుడు గారి మృతి భారతీయ కళా ప్రపంచానికి తీరని లోటు. ప్రముఖ నృత్యకారులు శ్రీ. వెంపటి చిన సత్యం శిష్యురాలైన శోభా నాయుడు గారు పద్మశ్రీ తో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. హైదరాబాద్ లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ఎంతో మంది పిల్లలకు నాట్యం నేర్పించారు. వీరి శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు.