ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT Society ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత మరియు అభివృద్ధి కొరకు APNRT Society మైగ్రంట్ రీసోర్స్ సెంటర్ ద్వారా 24/7 హెల్ప్ లైన్ నెలకొల్పింది. ఈ 24/7 హెల్ప్ లైన్ సంవత్సరంలో 365 రోజులూ నిరంతరాయంగా పనిచేస్తూ ప్రవాసాంధ్రులకు సేవలందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల కొరకు ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సౌకర్యం, ఎక్స్-గ్రేషియా, ప్రవాసాంధ్రుల భౌతికకాయాలను స్వగ్రామాలకు తరలింపులో సహాయం, పెట్టుబడులపై సలహాలు, కనెక్ట్ టు ఆంధ్రా – ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్, అడ్వాన్స్డ్ ఐటి కోర్సులలో శిక్షణ, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, కెరీర్ కౌన్సెలింగ్ (విద్యావాహిని), అత్యవసర పరిస్థితులలో స్వదేశానికి తీసుకురావడం, NRI గ్రీవెన్స్ సెల్, రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల దర్శనాలు,పాస్ పోర్ట్, ఓసిఐ/పాన్/ఆధార్ కార్డ్ దరఖాస్తు చేసుకునే విధానం గురించి మార్గదర్శనం చేయడం, ముఖ్యమైన పత్రాలు పోగొట్టుకున్నప్పుడు తిరిగి పొందడంలో సహాయపడటం, పన్ను చెల్లింపు పై సలహాలు, టూర్స్ మరియు ప్యాకేజెస్ వంటి వివిధ సేవలు అందిస్తోంది. ప్రవాసాంధ్రులు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ 24/7 హెల్ప్ లైన్ 08632340678 ని సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.