Embassy
Facebook
Twitter
Instagram
Youtube
కువైట్ నుండి విజయవాడకు 12 - 07 – 2020న అంబాసిడర్ ట్రావెల్స్ ద్వారా చేరిన కువైట్ ఎయిర్ వేస్ విమానం లో వివిధ సమస్యలలో ఇరుక్కొని అవస్ధలు పడుతున్న ముగ్గురు మహిళలను భారత రాయబార కార్యాలయం సహకారంతో సమస్యలు పరిష్కరించి ముగ్గురు మహిళలతో పాటు ఒక శిశువుకు ఉచిత టికెట్స్ ఏర్పాటు చేసిన APNRTS కువైట్ కో ఆర్డినేటర్ ముమ్మడి బాలిరెడ్డి గారికి APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి గారు, సీఈఓ శ్రీ. బి. శ్రీనివాస్ రావు గారు, శ్రీ. డైరెక్టర్ ఇలియాస్ గారు అభినందనలు తెలిపారు. విజయవాడ విమానాశ్రయం వచ్చిన మహిళలను ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ శ్రీ. ఇలియాస్ మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భముగా మహిళలు మాట్లాడుతూ మా సమస్యలను పరిష్కరించిన ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యులు బాలి రెడ్డి గారికి, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారికి, సీఈఓ శ్రీనివాసులు గారికి, డైరెక్టర్ ఇలియాస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.