Embassy
Facebook
Twitter
Instagram
Youtube
కువైట్ ఆమ్నెస్టీ కార్యక్రమం కింద ఏపీ వలస కార్మికులు కువైట్ నుండి గురువారం విశాఖపట్టణం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. రాష్ట్రానికి చేరుకోవడంతో ప్రయాణీకుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోనే రాష్ట్రానికి రాగలిగామని, ఇందుకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు సహకరించారని కృతఙ్ఞతలు తెలిపారు. ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది వీరందరికీ అల్పాహారాన్ని అందించింది.గత 8 వారాలుగా విదేశాలలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను తిరిగి తీసుకురావడంలో ఏపీఎన్ఆర్టీఎస్ కీలక పాత్ర పోషించింది.