ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రవాసాంధ్రులు 22nd May 2020 న సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.

22nd May 2020  రాత్రి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన అంతర్జాతీయ విమానాల్లో సౌదీ అరేబియా లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. సొంత రాష్ట్రానికి చేరుకోవడంతో వారంతా ఎంతో సంతోషపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎన్ఆర్టీఎస్ వచ్చిన ప్రయాణీకులకు అల్పాహారం ఏర్పాటు చేసింది. గత 8 వారాలుగా విదేశాలలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను తిరిగి తీసుకురావడంలో ఏపీఎన్ఆర్టీఎస్ కీలక పాత్ర పోషించింది.