కువైట్ ఆమ్నెస్టీ కార్యక్రమం కింద మొదటి విడతగా ఏపీ వలస కార్మికులు కువైట్ నుండి 22nd May 2020  సాయంత్రం విజయవాడకు ప్రత్యేక విమానంలో వచ్చారు.

కువైట్ ఆమ్నెస్టీ కార్యక్రమం కింద మొదటి విడతగా ఏపీ వలస కార్మికులు కువైట్ నుండి 22nd May 2020  సాయంత్రం విజయవాడకు ప్రత్యేక విమానంలో వచ్చారు. గత కొన్ని వారాలుగా కువైట్ లోని షెల్టర్లలో చిక్కుకుపోయి, రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికుల కోసం రాష్ట్ర కోవిడ్ -19 నోడల్ బృందం యొక్క జిల్లా రిసెప్షన్ బృందాలు, విమానాశ్రయ అధికారులు మరియు ఏపీ ఎన్ ఆర్ టీ ఎస్ సిబ్బంది విమానాశ్రయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి చేరుకోవడంతో ప్రయాణీకుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోనే రాష్ట్రానికి రాగలిగామని, ఇందుకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు సహకరించారని కృతఙ్ఞతలు తెలిపారు. ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది వీరందరికీ అల్పాహారాన్ని అందించింది.