Embassy
Facebook
Twitter
Instagram
Youtube
మొదటి విడతలో కువైట్ లోని వలసకార్మికులతో రెండవ విమానం మొదటిసారిగా 22nd May 2020 తెల్లవారుఝామున సుమారు 1:50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానం హైదరాబాద్ మీదు గా రేణిగుంట చేరుకుంది. వీరిలో ఒకరు హైదరాబాద్ లో దిగగా, మిగతా ప్రయాణికులు రేణిగుంట విమానాశ్రయం లో దిగారు. రాష్ట్ర నోడల్ బృందం ఆధ్వర్యం లో జిల్లా రిసెప్షన్ బృందాలు, విమానాశ్రయ అధికారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది విమానాశ్రయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త గారు విమానాశ్రయం చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇన్ని రోజుల తర్వాత సొంత రాష్ట్రానికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.