Embassy
Facebook
Twitter
Instagram
Youtube
20th May 2020 ఉదయం విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మొదటి విమానంలో యుకెలో చిక్కుకున్న విద్యార్థులు, సందర్శకులు, అత్యవసర సహాయం అవసరమైన ప్రవాసాంధ్రులు వచ్చారు. ప్రయాణీకులందరూ విమానాశ్రయంలో చేసిన ఏర్పాట్ల గురించి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమను స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో చేసిన కృషికి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టీఎస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎన్ఆర్టీఎస్ వచ్చిన ప్రయాణీకులకు అల్పాహారాన్ని అందించింది.