Embassy
Facebook
Twitter
Instagram
Youtube
కోవిడ్19 కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యం లో రాష్ట్రం లోని ఐటి కంపెనీల స్థితిగతుల పై చర్చించడానికి ఐటిఈ అండ్ సి డిపార్టుమెంట్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్ లో ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. కోన శశిధర్, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి , సీఈఓ శ్రీ. బి. శ్రీనివాస రావు, డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ కరీం, ఐటిఈ అండ్ సి డిపార్టుమెంట్ అధికారులు, పలు ఐటి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. లాక్ డౌన్ కారణంగా కంపెనీలు పరిమిత సిబ్బందితో పనిచేస్తూ వస్తున్నాయి. వారికి అవసరమైన అనుమతులు లభ్యమయ్యాయా లేదా, ఇంకేమైనా ఇబ్బందులున్నాయా అన్న విషయాలు చర్చకు వచ్చాయి. లాక్ డౌన్ అనంతరం ఎలాంటి అనుమతులు అవసరమవుతాయి అనే దాని పై చర్చించారు. ఐటి కంపెనీలకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా ఏపీఎన్ఆర్టీఎస్ సర్వసన్నద్ధంగా ఉంటుందని శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యెక కార్యదర్శి శ్రీ సుందర్, ఐఎఫ్ఎస్ నేతృత్వంలో ఐటికి సంబంధించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటయ్యింది.