Embassy
Facebook
Twitter
Instagram
Youtube
సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ (SATC) ఆధ్వర్యంలో జోహెన్నెస్ బర్గ్, సౌత్ ఆఫ్రికా లో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎన్ఆర్ టీ సొసైటీ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు పాల్గొన్నారు. కార్యక్రమం లో పాల్గొన్న ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రపంచం లో తెలుగు వారు ఎక్కడున్నా వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని పండుగలను జరుపుకోవటం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రపంచం లో ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా, వారికి ఏపీఎన్ఆర్ టీ ఎస్ అండగా ఉంటుందన్నారు. సొసైటీ అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సేవ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం, దేవాలయాల దర్శనం వంటి ఎన్నో సేవలను అందిస్తోందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమ్మ ఒడి,నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జగన్ అన్న గోరు ముద్ద పేరుతో పౌష్టికాహారం అందచేయటం, యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ ఇవ్వడం లో భాగంగా నైపుణ్య విద్యాలయాలను ఏర్పాటు చేస్తుండడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారన్నారు. అంతేకాకుండా ప్రవాసాంధ్రులను అభివృద్ధి లో భాగస్వాములను చేస్తూ కనెక్ట్ టు ఆంధ్ర కార్యక్రమానికి పిలుపునిచ్చారని అన్నారు. అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతంలో కేంద్రికృతం అవ్వ కూడదు…అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న దృఢ సంకల్పంతో సౌత్ ఆఫ్రికా తరహాలో మూడు రాజధానులు నిర్ణయం చేయటం జరిగింది అని, దీనికి ప్రతి తెలుగు వారు మద్దతు తెలపాలని కోరారు.