Embassy
Facebook
Twitter
Instagram
Youtube
రాష్ట్రం లోని యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గౌతం రెడ్డి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శాఖను అదనంగా అప్పగించడం తో మంగళవారం ఆ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సచివాలయం లోని తన ఛాంబర్ లో నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు హాజరైన ఏపిఎన్‌ఆర్‌టిఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు మాట్లాడుతూ గుంటూరు, రాజంపేటలో ఏపిఎన్‌ఆర్‌టిఎస్ అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగ నియామకాలు, అవకాశాల గురించి వివరించారు.