Embassy
Facebook
Twitter
Instagram
Youtube
వీవీఐటీ బాలోత్సవ్ 2019 అట్టహాసంగా ప్రారంభమైంది.. ఏపీఎన్ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ యస్ మేడపాటి గారు పోటీల ప్రారంభ సూచికగా విజయ గంటను మ్రోగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకట్ గారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవిత కాలం గుర్తుండిపోయే సమయం బాల్యం అన్నారు. తరగతి గదిలో కన్నా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సైన్సు విహార యాత్రలకు వెళ్ళడం మధుర స్మృతులు గా మిగిలిపోతాయి. ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాష, కళల పట్ల అవగాహన కల్పిస్తాయని తెలిపారు.