APNRTS సేవలపై మీ అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT Society ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత మరియు అభివృద్ధి కొరకు వివిధ సేవలను అందిస్తోంది.ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సౌకర్యం, ఎక్స్-గ్రేషియా, ఆమ్నెస్టీ కింద వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకురావడం, ప్రవాసాంధ్రుల భౌతికకాయాలను స్వగ్రామాలకు తరలింపులో సహాయం, పెట్టుబడులపై సలహాలు, కనెక్ట్ టు ఆంధ్రా, ఐటి శిక్షణలు, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణలు, కెరీర్ కౌన్సెలింగ్ (విద్యావాహిని), అత్యవసరంగా స్వదేశానికి తిరిగి రావడంలో సహకారం, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఆలయ దర్శనాలు లాంటి అనేక సేవలను అందిస్తోంది. కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా విదేశాలలో చిక్కుకున్న (నిరుద్యోగులు, విద్యార్థులు, సందర్శనకు వెళ్ళిన వారు, వీసా గడువు పూర్తయిన వారు, రెసిడెన్సీ వీసా హోల్డర్లు మొదలైన) ప్రవాసాంధ్రులను తిరిగి వారి స్వస్థలాలకు వందే భారత్ మిషన్ మరియు చార్టర్ విమానాల ద్వారా చేర్చడంలో ఏపీఎన్‌ఆర్‌టీ‌ఎస్ విశేష కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలో APNRTS సేవలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.